దళిత వైద్యుడిపై దాడి అమానుషం

ABN , First Publish Date - 2020-05-17T10:34:18+05:30 IST

విశాఖలో దళిత వైద్యుడు డాక్టర్‌ సుధాకర్‌రావుపై జరిగిన దా డికి సీఎం జగన్‌ బాధ్యత వహించాలని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు.

దళిత వైద్యుడిపై దాడి అమానుషం

ఫాసిస్టు పాలనలో ఉన్నామా?: బాబు

పోలీసులు క్షమాపణ చెప్పాలి: ఐఎంఏ

సస్పెన్షన్‌ ఎత్తేయాలి: వైద్యుల సంఘం


అమరావతి, మే 16(ఆంధ్రజ్యోతి): విశాఖలో ద ళిత వైద్యుడు డాక్టర్‌ సుధాకర్‌రావుపై జరిగిన దా డికి సీఎం జగన్‌ బాధ్యత వహించాలని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ‘డాక్టర్‌పై దాడి చే సిన వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి. సుధాకర్‌కు మెరుగైన వైద్యం అందించాలి’ అని శనివారం ప్రకటనలో డిమాండ్‌ చేశా రు. ‘చేతులు కట్టేయడం, లాఠీలతో కొట్టడం హే యం. ఇది దళితులపైన, వైద్యవృత్తిపైన జరిగిన దాడి. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా? ఫాసిస్ట్‌ పాలనలో ఉన్నామా?’ అని ప్రశ్నించారు. కాగా, ఓ డాక్టర్‌కు ఇలా జరగడం బాధాకరమని ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌(ఐఎంఏ) రాష్ట్ర కా ర్యదర్శి డాక్టర్‌ పి.ఫణీంద్ర ఓ ప్రకటనలో పేర్కొన్నా రు. ఘటనపై ప్రభుత్వం విచారణ చేపట్టాలని,  డాక్టర్‌కు పోలీసులు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. కాగా, డాక్టర్‌ సుధాకర్‌ సస్పెన్షన్‌ను రద్దు చేయాలని ప్రభుత్వ వైద్యుల సంఘం కన్వీనర్‌ డాక్టర్‌ జయధీర్‌ డిమాండ్‌ చేశారు. 


జగన్‌ది క్రూర మనస్తత్వం: లోకేశ్‌

‘సీఎం జగన్‌ది క్రూర మనస్తత్వం. మాస్క్‌ ఇవ్వమని వేడుకున్న డాక్టర్‌ సుధాకర్‌ను నియంతలా సస్పెండ్‌ చేశారు. దళిత డాక్టర్‌ని తాళ్లతో కట్టి, లా ఠీలతో కొట్టించడం జగన్‌ ఉన్మాదానికి పరాకాష్ట’ అ ని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఒక ప్రకటనలో విమర్శించారు. కాగా, డాక్టర్‌ సుధాకర్‌పై దాడికి బాధ్యత వహిస్తూ సీఎం పదవికి జగన్‌ రాజీనామా చేయాలని మాజీ మంత్రులు జవహర్‌, నక్కా ఆనంద్‌బాబు, కిడారి శ్రావణ్‌ డి మాండ్‌ చేశారు. దళిత సోదరులంతా ఇప్పటికైనా కళ్లు తెరవాలని టీడీపీ ఎస్సీసెల్‌ అధ్యక్షుడు ఎం ఎస్‌ రాజు కోరారు. డాక్టర్‌పై దాడికి నిరసనగా ఆ దివారం అంబేడ్కర్‌ విగ్రహాల వద్ద ధర్నాలు చే యాలని పిలుపునిచ్చారు. ఈ ఘటన సీఎంని యంతృత్వానికి పరాకాష్ట అని మాజీ మంత్రి దేవినేని ఉమా ధ్వజమెత్తారు. 


జగనే కారణం: శైలజానాథ్‌

డాక్టర్‌ సుధాకర్‌ దుస్థితికి సీఎం జగన్‌రెడ్డే కారణమని ఏపీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్‌ ఒక ప్రకటనలో ఆరోపించారు. ఏపీలో ఆటవిక రాజ్యం ఉందో, నాగరిక సమాజం ఉందో అర్థం కావట్లేదని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ అన్నారు. విశాఖ ఘటనను న్యాయ వ్యవస్థ సుమోటోగా తీ సుకోవాలని కోరారు. పౌరహక్కుల సంఘాలు, వా మపక్షాలు ప్రత్యక్ష కార్యాచరణతో ప్రభుత్వానికి గు ణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు.

Updated Date - 2020-05-17T10:34:18+05:30 IST