అనంతపురం జిల్లా రాప్తాడులో దారుణం

ABN , First Publish Date - 2020-07-20T22:16:08+05:30 IST

రాప్తాడులో దారుణం జరిగింది. ఇంట్లో టీవీ చూసేందుకు..

అనంతపురం జిల్లా రాప్తాడులో దారుణం

అనంతపురం జిల్లా: రాప్తాడులో దారుణం జరిగింది. ఇంట్లో టీవీ చూసేందుకు వచ్చిన బాలికపై ఓ కీచకుడు అత్యాచారం చేశాడు. శేఖర్ అనే వ్యక్తి బాలికను మూడేళ్లుగా లోబర్చుకోవడంతో గర్భం దాల్చింది. బాలిక తల్లిదండ్రులకు విషయం తెలిసి పోలీసులను ఆశ్రయించారు. మాయ మాటలు చెప్పి అత్యాచారానికి పాల్పడినట్లు వాపోయారు. పోలీసులు శేఖర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా శేఖర్‌కు వివాహమై ఒక కుమారుడు కూడా ఉన్నాడు. బాలిక తల్లిదండ్రులకు కొంత డబ్బు, భూమి ఇచ్చి విషయం బయటకు రాకుండా కొందరు పెద్దలు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.

Updated Date - 2020-07-20T22:16:08+05:30 IST