గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో దారుణం

ABN , First Publish Date - 2020-08-18T17:35:05+05:30 IST

గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో దారుణం జరిగింది. గుండెపోటుతో వచ్చిన రోగికి..

గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో దారుణం

గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో దారుణం జరిగింది. గుండెపోటుతో వచ్చిన రోగికి ఆస్పత్రి సిబ్బంది నరకం చూపించారు. మంగళవారం తెల్లవారు జామున 4 గంటలకు వినుకొండ నుంచి ఓ వ్యక్తి గుండెపోటుతో ఆస్పత్రికి వచ్చారు. కరోనా పరీక్షలు చేయకుండా వైద్యం చేయటం కుదరదని ఆసుపత్రి సిబ్బంది చెప్పడంతో తీవ్రమైన గుండెపోటుతో కన్న కూతుళ్ల ముందే ఆయన ప్రాణాలు విడిచారు. దీనిపై జిల్లా కలెక్టర్‌కు ఫోన్ చేసినా స్పందించలేదని బాధితులు ఆరోపించారు. మృతదేహాన్ని కూడ పట్టించుకోవటం లేదని కన్న కూతుళ్లు కన్నీటిపర్యంతమయ్యారు.

Updated Date - 2020-08-18T17:35:05+05:30 IST