దళిత కుటుంబంపై దాడి

ABN , First Publish Date - 2020-09-18T08:36:28+05:30 IST

దళిత కుటుంబంపై కొంతమంది యువకులు మూకుమ్మడిగా దాడి చేసిన సంఘటనలో 20 మంది యువకులపై అట్రాసిటీ కేసు

దళిత కుటుంబంపై దాడి

20 మంది యువకులపై అట్రాసిటీ కేసు 

బాపట్ల టౌన్‌, సెప్టెంబరు 17 : దళిత కుటుంబంపై కొంతమంది యువకులు  మూకుమ్మడిగా దాడి చేసిన సంఘటనలో 20 మంది యువకులపై అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు గుంటూరు జిల్లా బాపట్ల సీఐ అశోక్‌కుమార్‌ గురువారం తెలిపారు. ఆయన కథనం ప్రకారం..  బాపట్ల 11వ వార్డు దేవునిమాన్యానికి చెందిన కె.భానుప్రసాద్‌ మార్చురీ బాక్సులు అద్దెకిస్తుంటారు. బుధవారం రాత్రి మార్చురీ బాక్సు తీసుకొని ఆటోలో ఇంటికి వెళుతుండగా మార్గమధ్యలో రోడ్డుపై కొందరు యువకులు మద్యం సేవిస్తూ ఆటోను అడ్డగించి  అసభ్యంగా మాట్లాడారు. అనంతరం ఆ యువకులు బాధితుడు భానుప్రసాద్‌ ఇంటికెళ్లిమరీ.. కులం పేరుతో దూషించటంతోపాటు అతడి భార్య రాహేల్‌ను, కుటుంబ సభ్యులను కొట్టి గాయపరిచారు. బాధితుల ఫిర్యాదు మేరకు 20 మంది యువకులపై డీఎస్పీ పర్యవేక్షణలో అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. 

Updated Date - 2020-09-18T08:36:28+05:30 IST