‘ఏటీఎం’ డబ్బులు నొక్కేశారు

ABN , First Publish Date - 2020-12-28T08:59:19+05:30 IST

కరోనా లాక్‌డౌన్‌ సమయంలో ఏటీఎంలలో డబ్బులు పెట్టకుండా రూ.60.90 లక్షలు స్వాహా చేసిన కస్టోడియన్లు ఎల్లాల జబీర్‌, సయ్యద్‌ అహ్మద్‌ను కడప జిల్లా పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు.

‘ఏటీఎం’ డబ్బులు నొక్కేశారు

రూ.60.90 లక్షలు స్వాహా.. కడప జిల్లాలో ఇద్దరు అరెస్టు


మైదుకూరు, డిసెంబరు 27: కరోనా లాక్‌డౌన్‌ సమయంలో ఏటీఎంలలో డబ్బులు పెట్టకుండా రూ.60.90 లక్షలు స్వాహా చేసిన కస్టోడియన్లు ఎల్లాల జబీర్‌, సయ్యద్‌ అహ్మద్‌ను కడప జిల్లా పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. మైదుకూరు డీఎస్పీ విజయ్‌కుమార్‌ మాట్లాడుతూ.. జిల్లాలోని ఏటీఎంలలో డబ్బు పెట్టేందుకు ఓ ప్రైవేటు కంపెనీ కుదుర్చుకున్న ఒప్పందం మేరకు ఎల్లాల జబీర్‌, సయ్యద్‌ అహ్మద్‌, చిన్న వెంకట సుబ్బయ్య ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. లాక్‌డౌన్‌ సమయంలో రూ.60 లక్షల 90 వేలను వీరు సొంతానికి వాడుకున్నట్లు సంస్థ బ్రాంచ్‌ మేనేజర్‌ మురళి ఈ నెల 27న పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారి నుంచి 10 లక్షల నగదు, బైక్‌, 7 లక్షల విలువైన షేర్‌ మార్కెట్‌ బాండ్లను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. మరో నిందితుడు చిన్న వెంకటసుబ్బయ్య సుమారు రూ.25 లక్షలు వాడుకున్నాడని, ఈ నెల 15న విషం తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు.  

Updated Date - 2020-12-28T08:59:19+05:30 IST