-
-
Home » Andhra Pradesh » Atchennaidu wrotes a letter to CM Jagan
-
సీఎం జగన్‌కు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు లేఖ
ABN , First Publish Date - 2020-11-27T19:30:14+05:30 IST
విజయవాడ: సీఎం జగన్‌కు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు లేఖ రాశారు.

విజయవాడ: సీఎం జగన్‌కు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు లేఖ రాశారు. రైతులను ఆదుకోవాలంటూ లేఖలో సీఎంను కోరారు. నివర్ తుపాను రైతులను కోలుకోలేని దెబ్బతీసిందన్నారు. ఆగస్ట్ నుంచి అక్టోబర్ వరకు కురిసిన వర్షాలకు రూ.9,720 కోట్ల మేర నష్టం వాటిల్లిందన్నారు. వరుస విపత్తులతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కోరారు. దెబ్బతిన్న పంటలను ప్రభుత్వమే మద్దతు ధరకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు త్వరితగతిన పంట నష్ట పరిహారం అందజేయాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు.