చంద్రబాబుని ఏకవచనంతో మాట్లాడే మంత్రులు మనుషులేనా?: అచ్చెన్న
ABN , First Publish Date - 2020-12-01T15:03:56+05:30 IST
అమరావతి: పంటల బీమా ఇన్సూరెన్స్ కట్టలేదని నిన్న ప్రభుత్వాన్ని నిలదీశామని టీడీపీ శాసనసభ పక్ష ఉపనేత అచ్చెన్నాయుడు తెలిపారు.

అమరావతి: పంటల బీమా ఇన్సూరెన్స్ కట్టలేదని నిన్న ప్రభుత్వాన్ని నిలదీశామని టీడీపీ శాసనసభ పక్ష ఉపనేత అచ్చెన్నాయుడు తెలిపారు. సభలో టీడీపీ అధినేత చంద్రబాబుని ఏకవచనంతో మాట్లాడే మంత్రులు మనుషులేనా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్స్యూరెన్స్ కట్టామని ప్రభుత్వం సభలో సీఎం, వ్యవసాయ మంత్రి అవాస్తవాలు చెప్పారన్నారు. అర్ధరాత్రి ఆదరా బాదరాగా 590 కోట్లు ప్రీమియం చెల్లిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. నిన్న అర్ధరాత్రి జీవో ఇచ్చిన వాళ్లు పంటల బీమా ప్రీమియం చెల్లించామని ఎలా అబద్ధాలు చెప్పారని ప్రశ్నించారు. ఏవిధంగా రైతుల్ని ప్రభుత్వం మోసం చేసిందో గ్రహించాలని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.