-
-
Home » Andhra Pradesh » Atchennaidu comments on YCP
-
జైల్ భరో పిలుపుతో ప్రభుత్వ పునాదులు కదిలాయి: అచ్చెన్న
ABN , First Publish Date - 2020-10-31T17:32:07+05:30 IST
అమరావతి: కాడి పట్టుకున్న చేతులకు సంకెళ్లు వేసి.. రైతు ద్రోహిగా ఏపీ సీఎం జగన్‌రెడ్డి మిగిలిపోయారని

అమరావతి: కాడి పట్టుకున్న చేతులకు సంకెళ్లు వేసి.. రైతు ద్రోహిగా ఏపీ సీఎం జగన్‌రెడ్డి మిగిలిపోయారని టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శించారు. గుంటూరు జైల్ భరో పిలుపుతో ప్రభుత్వ పునాదులు కదిలాయని అచ్చెన్న తెలిపారు. జైల్ భరోకు వెళ్తున్న వారిని హౌస్ అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. రాష్ట్రంలో ఐపీసీ సెక్షన్లు కాదు, వైసీపీ సెక్షన్లు అమలవుతున్నాయన్నారు. రాజధానికి వ్యతిరేకంగా పెయిడ్ ఉద్యమాలకు శ్రీకారం చుట్టి.. వైసీపీ నేతలు ప్రజల మధ్య చిచ్చు పెట్టొద్దని అచ్చెన్నాయుడు సూచించారు. రైతు రాజ్యం అంటే ప్రశ్నించిన రైతులకు బేడీలు వేయడమా? అని ప్రశ్నించారు. తాడేపల్లి రాజప్రసాదంలో కూర్చుని ఏం చేయాలో అర్థంకాక.. రైతులపై పగ, ప్రతీకారాలకు జగన్‌రెడ్డి శ్రీకారం చుట్టారని అచ్చెన్నాయుడు విమర్శించారు.