మీ అభిమానం ఎప్పుడూ ఇలాగే ఉండాలి: అచ్చెన్న

ABN , First Publish Date - 2020-10-19T20:52:02+05:30 IST

ఏపీ టీడీపీ అధ్యక్షులుగా నియమితులవ్వడంపట్ల అచ్చెన్నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ట్విట్టర్ వేదికగా తన ఆనందాన్ని పంచుకున్నారు.

మీ అభిమానం ఎప్పుడూ ఇలాగే ఉండాలి: అచ్చెన్న

ఇంటర్నెట్ డెస్క్: ఏపీ టీడీపీ అధ్యక్షులుగా తనను నియమించడం పట్ల అచ్చెన్నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ట్విట్టర్ వేదికగా తన ఆనందాన్ని పంచుకున్నారు. ఈ రోజు మీ అందరి ఆశీస్సులు, ఆదరాభిమానాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా.. పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ బాబు నియమించారని ట్వీట్ చేశారు. మీ ఆశీస్సులు అభిమానం ఎప్పుడు ఇలాగే ఉండాలని, అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్ధిస్తున్నానని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. 

Updated Date - 2020-10-19T20:52:02+05:30 IST