అచ్చెన్న బెయిల్‌ పిటిషన్‌పై ముగిసిన వాదనలు

ABN , First Publish Date - 2020-07-28T08:56:15+05:30 IST

ఈఎస్ఐ వ్యవహారానికి సంబంధించి ఏసీబీ అధికారులు అరెస్టు చేసిన కేసులో బెయిల్‌ ఇవ్వాలని అభ్యర్థిస్తూ

అచ్చెన్న బెయిల్‌ పిటిషన్‌పై ముగిసిన వాదనలు

అమరావతి, జూలై 27(ఆంధ్రజ్యోతి): ఈఎస్ఐ వ్యవహారానికి సంబంధించి ఏసీబీ అధికారులు అరెస్టు చేసిన కేసులో బెయిల్‌ ఇవ్వాలని అభ్యర్థిస్తూ మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే కె.అచ్చెన్నాయుడు దాఖలు చేసిన పిటిషనపై సోమవారం హైకోర్టులో వాదనలు ముగిశాయి. న్యాయమూర్తి జస్టిస్‌ ఎం.వెంకటరమణ ముందు జరిగిన విచారణ సందర్భంగా పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా, ఏసీబీ తరఫున అడ్వకేట్‌ జనరల్‌ ఎస్‌.శ్రీరాం వాదనలు వినిపించారు. ఇరువురి వాదనల్ని పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి.. తీర్పును వాయిదా వేశారు. ఇదే కేసులో ఏ1గా ఉన్న ఈఎ్‌సఐ మాజీ డైరెక్టర్‌ సీకే రమేశ్‌కుమార్‌ బెయిల్‌ పిటిషన్‌పైనా సోమవారం విచారణ జరిగింది. ఈ కేసులో తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేశారు. 

Updated Date - 2020-07-28T08:56:15+05:30 IST