-
-
Home » Andhra Pradesh » atchannaidu
-
ఎస్పీ, డీఎస్పీని సస్పెండ్ చేయాలి: అచ్చెన్నాయుడు
ABN , First Publish Date - 2020-10-31T23:46:09+05:30 IST
ఎస్పీ, డీఎస్పీని సస్పెండ్ చేయాలి: అచ్చెన్నాయుడు

శ్రీకాకుళం: రైతులకు బేడీలు ఘటనలో ఎస్పీ, డీఎస్పీని సస్పెండ్ చేయాలని టీడీపీ నేత అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు. పోలీసులు అత్యుత్సాహంతో బేడీలు వేశారని డీజీపీ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని మండిపడ్డారు. అరెస్ట్ చేసిన రైతులను విడిచి పెట్టి సీఎం క్షమాపణ చెప్పాలన్నారు. రాజధానికి భూములు ఇవ్వడమే రైతులు చేసిన నేరమా? అని ప్రశ్నించారు. దళితుల మీదే అట్రాసిటీ కేసు పెట్టడం ఈ ప్రభుత్వానికే చెల్లిందన్నారు. రైతులను రాజులను చేస్తామని 17 నెలలుగా దగా చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. జగన్ పాదయాత్రతో అన్ని వర్గాలను మోసం చేసి అధికారంలోకి వచ్చారని వ్యాఖ్యానించారు.