అసెంబ్లీ సమావేశాలు వాయిదా వేయండి

ABN , First Publish Date - 2020-03-24T09:29:31+05:30 IST

కరోనా వైరస్‌ నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలను వాయిదా వేసే అంశాన్ని ప్రభుత్వం పరిశీలించాలని సచివాలయ ...

అసెంబ్లీ సమావేశాలు వాయిదా వేయండి

సచివాలయ ఉద్యోగుల సంఘం నేత వినతి

అమరావతి, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): కరోనా వైరస్‌ నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలను వాయిదా వేసే అంశాన్ని ప్రభుత్వం పరిశీలించాలని సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి విజ్ఞప్తి చేశారు. ఆర్డినెన్సు ద్వారా కూడా ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను ఆమోదించుకునే అవకాశం ఉందని తెలిపారు. రాష్ట్రప్రభుత్వం లాక్‌డౌన్‌ ఆదేశాలు ఇవ్వడంతో సచివాలయానికి ఉద్యోగుల రాకపోకలకు ఇబ్బంది కలుగుతోందని.. వీలైనంత మేర ఇంటి నుంచే విధులు నిర్వహించేలా ఆదేశాలు జారీ చేయాలన్నారు.  కాగా.. పారిశుధ్య విభాగంతోపాటు కరోనా నియంత్రణ విభాగాల్లో పనిచేసే వారికి సాయం చేసేందుకు సచివాలయ ఉద్యోగులు ఒకరోజు వేతనాన్ని సీఎం సహాయ నిధికి ఇవ్వాలని నిర్ణయించినట్లు వెంకట్రామిరెడ్డి తెలిపారు. ఉద్యోగుల ఏపీజేఏసీ చైర్మన్‌ చంద్రశేఖరరెడ్డి కూడా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు ఒక రోజు వేతనాన్ని విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు.

Updated Date - 2020-03-24T09:29:31+05:30 IST