విజయసాయిరెడ్డిపై అశోక్‌బాబు విమర్శలు

ABN , First Publish Date - 2020-07-11T01:52:40+05:30 IST

ఎంపీ విజయసాయిరెడ్డిపై ఎమ్మెల్సీ అశోక్‌బాబు విమర్శలు గుప్పించారు. ట్రైలర్‌తోనే వేల కోట్ల ప్రజాధనం దోపిడీ చేశారని, మిగిలిన కాలంలో మరెంత దోస్తారో అని అన్నారు.

విజయసాయిరెడ్డిపై అశోక్‌బాబు విమర్శలు

అమరావతి: ఎంపీ విజయసాయిరెడ్డిపై ఎమ్మెల్సీ అశోక్‌బాబు విమర్శలు గుప్పించారు. ట్రైలర్‌తోనే వేల కోట్ల ప్రజాధనం దోపిడీ చేశారని, మిగిలిన కాలంలో మరెంత దోస్తారో అని అన్నారు. పెంచిన మద్యం ధరలతో కొల్లేరైన పేదల కాపురాలు ట్రైలర్‌లో కనిపించాయని చెప్పారు. విజయసాయిరెడ్డి అల్లుడి ఆంబులెన్స్ స్కాం కనిపించిందని ఆరోపించారు. విద్యుత్ ఛార్జీల పెంపు, సిమెంట్-ఇసుక, రేషన్ సరుకుల ధరల బాదుడు కనిపించిందన్నారు. మీడియా, రాజ్యాంగ వ్యవస్థలపై దాడులు ట్రైలర్‌లో కనిపించాయని, మీ ఎంపీలు, ఎమ్మెల్యేల దగ్గర దిగజారిన మీ స్థాయి మాత్రం ట్రైలర్‌లో కనబడలేదని  అశోక్‌బాబు పేర్కొన్నారు.

Updated Date - 2020-07-11T01:52:40+05:30 IST