-
-
Home » Andhra Pradesh » arrest tdp leader in ap
-
ఏపీలో మరో టీడీపీ సానుభూతిపరుడి అరెస్ట్
ABN , First Publish Date - 2020-06-23T13:33:35+05:30 IST
ఏపీలో టీడీపీ సానుభూతిపరుల అరెస్ట్‌ల పరంపర కొనసాగుతోంది. ఈ తెల్లవారుజామున విశాఖలో నలంద కిషోర్‌ను సీఐడీ పోలీసులు అదుపులోకి

కృష్ణాజిల్లా: ఏపీలో టీడీపీ సానుభూతిపరుల అరెస్ట్‌ల పరంపర కొనసాగుతోంది. ఈ తెల్లవారుజామున విశాఖలో నలంద కిషోర్‌ను సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంత్రి అవంతి శ్రీనివాస్, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిలపై మీడియాలో హల్‌చల్ అవుతున్న కథనాన్ని ఫార్వర్డ్ చేశారంటూ అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. అలాగే కృష్ణాజిల్లా నందిగామలో టీడీపీకి చెందిన చిరుమామిళ్ల కృష్ణను కూడా అరెస్ట్ చేశారు. సోషల్ మీడియాలో పోస్టింగ్ పెట్టారంటూ అర్థరాత్రి సమయంలో అతడ్ని సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కర్నూలు కోర్టులో కృష్ణను హాజరు పరచనున్నారు.