‘రైతుల అరెస్టు’ విచారణ వాయిదా

ABN , First Publish Date - 2020-11-21T09:09:10+05:30 IST

రాజధాని ప్రాంత రైతులపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసి జైలుకు తరలించిన వ్యవహారంపై దాఖలైన పిటిషన్‌ విచారణ .

‘రైతుల అరెస్టు’ విచారణ వాయిదా

అమరావతి, నవంబరు 20(ఆంధ్రజ్యోతి): రాజధాని ప్రాంత రైతులపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసి జైలుకు తరలించిన వ్యవహారంపై దాఖలైన పిటిషన్‌ విచారణ ఈ నెల 27వ తేదీకి వాయిదా పడింది. ఈ వ్యవహారంలో దర్యాప్తు అధికారి నివేదిక దాఖలు చేసేందుకు మరికొంత గడువు కోరడంతో అనుమతించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కె.లలిత.. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాజధాని ప్రాంతానికి చెందిన ఏడుగురు రైతులను అరెస్టు చేయడాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై ఇటీవల విచారణ జరిపిన న్యాయమూర్తి.. వారికి బెయిలు మంజూరు చేయడంతో పాటు పోలీసులు, సంబంధిత న్యాయాధికారులు నివేదిక సమర్పించాలని ఆదేశించిన విషయం తెలిసిందే.

Read more