శ్రీకాకుళం: జవాన్‌ ఉమమాహేశ్వరరావుకు టీడీపీ నేతల నివాళి

ABN , First Publish Date - 2020-07-22T17:10:22+05:30 IST

శ్రీకాకుళం: జవాన్‌ ఉమమాహేశ్వరరావుకు టీడీపీ నేతల నివాళి

శ్రీకాకుళం: జవాన్‌ ఉమమాహేశ్వరరావుకు టీడీపీ నేతల నివాళి

శ్రీకాకుళం: కార్గిల్‌లో ఈనెల 18న బాంబులు నిర్వీర్యం చేస్తూ ప్రాణాలు కోల్పోయిన జిల్లా హడ్కో కాలనీ వాసి, ఆర్మీ జవాన్ లావేటి ఉమామహేశ్వరావుకు టీడీపీ నేతలు నివాళులర్పించారు. బుధవారం ఉదయం జవాన్ భౌతికకాయానికి అంత్యక్రియలు నిర్వహించారు. అంతకు ముందు మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి,  నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాదారపు వెంకటేష్... వీర జవాన్ భౌతికకాయాన్ని సందర్శించి సంతాపం తెలిపారు. జవాన్ ఉమామహేశ్వరరావుకు ఘనంగా నివాళులర్పిస్తూ నేతలు, అభిమాన ప్రజానీకం అంతిమయాత్రలో పాల్గొన్నారు. 

Updated Date - 2020-07-22T17:10:22+05:30 IST