కంచే చేను మేసింది
ABN , First Publish Date - 2020-12-13T08:57:46+05:30 IST
కంచే చేను మేసిన చందంగా నేరాలను అరికట్టాల్సిన ఆర్మ్‌డ్ రిజర్వ్ (ఏఆర్) కానిస్టేబుల్ స్మగ్లర్ అవతారమెత్తాడు.

గంజాయి రవాణా చేస్తూ పట్టుబడ్డ ఏఆర్ కానిస్టేబుల్
ఉప్పల్, డిసెంబరు12 (ఆంధ్రజ్యోతి): కంచే చేను మేసిన చందంగా నేరాలను అరికట్టాల్సిన ఆర్మ్‌డ్ రిజర్వ్ (ఏఆర్) కానిస్టేబుల్ స్మగ్లర్ అవతారమెత్తాడు. అక్రమార్జన కోసం గంజాయిని హైదరాబాద్‌కు సరఫరా చేస్తూ దొరికిపోయాడు. అనంతపురం జిల్లాలో పోలీస్ ట్రాన్స్‌పోర్ట్ విభాగంలో ఆర్మ్‌డ్ రిజర్వ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న జె.ృష్ణమోహన్(36) 2నెలలుగా గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నారు. నర్సీపట్నంలో గంజాయిని కిలో రూ.2వేల చొప్పున కొనుగోలు చేసి హైదరాబాద్‌లో రూ.8వేలకు అమ్మడం మొదలుపెట్టారు. ఈ దందాలో ఆరితేరిన మరో ఇద్దరు వ్యక్తులతో కలిసి శనివారం కారులో 200కిలోల గంజాయి తరలిస్తుండగా ఉప్పల్ ప్రాంతంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనకు సహకరిస్తున్న జనగాం పాలకుర్తికి చెందిన నారగోని సోమయ్య, నల్లగొండ జిల్లా గుండాల మండలం మాసన్‌పల్లికి చెందిన బానోత్ యాదగిరిలను అరెస్టు చేశారు.