రూ.3.25 కోట్ల విలువ చేసే ఆరెక నట్స్ సీజ్

ABN , First Publish Date - 2020-05-13T22:01:42+05:30 IST

కృష్ణపట్నం పోర్టులో అక్రమంగా దిగుమతి చేసుకున్న రూ.3.25కోట్ల విలువ చేసే 113 మెట్రిక్ టన్నుల ఆరెక నట్స్‌ని డీఆర్ఐ అధికారులు సీజ్ చేశారు. కోకోనట్ ఎక్స్‌పెల్లర్ కేక్ అనుమతితో ఆరెక

రూ.3.25 కోట్ల విలువ చేసే ఆరెక నట్స్ సీజ్

నెల్లూరు: కృష్ణపట్నం పోర్టులో అక్రమంగా దిగుమతి చేసుకున్న రూ.3.25కోట్ల విలువ చేసే 113 మెట్రిక్ టన్నుల ఆరెక నట్స్‌ని డీఆర్ఐ అధికారులు సీజ్ చేశారు. కోకోనట్ ఎక్స్‌పెల్లర్ కేక్ అనుమతితో ఆరెక నట్స్‌ని స్మగ్లింగ్ చేస్తుండటాన్ని అధికారులు గుర్తించారు. కంటైనర్‌లో రెండు వరుసల వెనుక ఆరెక నట్స్ ఉంచారు. ఇండోనేషియా నుంచి వీటిని దిగుమతి చేసుకుంటుండగా అధికారులు గుర్తించి సీజ్ చేశారు. వీటిని స్మగ్లింగ్ చేస్తున్న వ్యక్తులను అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

Read more