-
-
Home » Andhra Pradesh » APUWJ
-
సమాచారశాఖ తీరు సరికాదు: ఏపీయూడబ్ల్యూజే
ABN , First Publish Date - 2020-12-06T08:52:19+05:30 IST
సమాచారశాఖ తీరు సరికాదు: ఏపీయూడబ్ల్యూజే

అమరావతి/విజయవాడ సిటీ, డిసెంబరు 5: జర్నలిస్టుల ప్రాతినిధ్యం లేకుండా ప్రభుత్వ అధికారులతో అక్రిడిటేషన్ కమిటీలను ఏర్పాటు చేయాలన్న సమాచార, పౌరసంబంధాలశాఖ నిర్ణయం అప్రజాస్వామికమని ఏపీయూడబ్ల్యుజే అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఐవీ సుబ్బారావు, చందు జనార్దన్ తెలిపారు. నవంబరు 30న కమిషనర్ జారీచేసిన మెమోను వెంటనే ఉపసంహరించాలని డిమాండ్ చేశారు.