సంక్రాంతికి ఏపీఎస్‌ ఆర్టీసీ స్పెషల్ బస్సులు

ABN , First Publish Date - 2020-12-19T22:42:47+05:30 IST

ప్రయాణికులకు ఏపీఎస్‌ ఆర్టీసీ గుడ్‌న్యూస్ చెప్పింది. సంక్రాంతి పండుగ పురస్కరించుకుని ఏపీఎస్‌ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపనుంది

సంక్రాంతికి ఏపీఎస్‌ ఆర్టీసీ స్పెషల్ బస్సులు

అమరావతి: ప్రయాణికులకు ఏపీఎస్‌ ఆర్టీసీ గుడ్‌న్యూస్ చెప్పింది. సంక్రాంతి పండుగ పురస్కరించుకుని ఏపీఎస్‌ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపనుంది. ఏపీ నుంచి తెలంగాణకు ఆర్టీసీ స్పెషల్ బస్సులు నడపనుంది. వచ్చే ఏడాది జనవరి 8 నుంచి 13 వరకు ఈ ప్రత్యేక బస్సులు నడవనున్నట్లు ఏపీఎస్‌ ఆర్టీసీ వెల్లడించింది. తెలంగాణకు 1,251 బస్సులు నడపనున్నట్లు ఏపీఎస్‌ ఆర్టీసీ పేర్కొంది. అలాగే ఇతరు రాష్ట్రాలకు కూడా స్పెషల్ బస్సులు నడుపుతున్నట్లు తెలిపింది. బెంగళూరు నుంచి 433, చెన్నై నుంచి 133 బస్సులు నడుపుతున్నట్లు ఏపీఎస్‌ ఆర్టీసీ స్పష్టం చేసింది.

Read more