‘రాజధాని మార్పు ప్రభుత్వ ఉద్యోగులకు ఇబ్బందే’
ABN , First Publish Date - 2020-03-02T17:52:55+05:30 IST
‘రాజధాని మార్పు ప్రభుత్వ ఉద్యోగులకు ఇబ్బందే’

తిరుపతి: రాజధాని మార్పు జరిగితే విశాఖలో ఉద్యోగులకు ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పించాలని ఏపీఎన్జీవో అధ్యక్షుడు చంద్రశేఖర్‌రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులకు స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరామని తెలిపారు. రాజధాని మార్పుతో ప్రభుత్వ ఉద్యోగులకు కాస్త ఇబ్బందే అని చెప్పుకొచ్చారు. ఏపీ ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న మాట వాస్తవమే అని... ఆర్థిక ఇబ్బందులు ఉన్నా తమ జీతాలు సక్రమంగా ఇవ్వాలని కోరారు. జీతం ఆగిపోతుందన్న ఆందోళన ప్రభుత్వ ఉద్యోగుల్లో ఉందని చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు.