అక్టోబరు 6న అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశం

ABN , First Publish Date - 2020-09-29T08:19:53+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల మధ్య జలవివాదాలపై చర్చించడానికి కేంద్ర ప్రభుత్వం అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశం తేదీని ఖరారు చేసింది. అక్టోబరు 6న

అక్టోబరు 6న అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశం

ఏపీ, తెలంగాణ మధ్య జలవివాదాలపై చర్చ 


న్యూఢిల్లీ, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల మధ్య జలవివాదాలపై చర్చించడానికి కేంద్ర ప్రభుత్వం అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశం తేదీని ఖరారు చేసింది. అక్టోబరు 6న కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ అధ్యక్షతన వీడియో కాన్ఫరెన్సు ద్వారా జరగనున్న ఈ సమావేశంలో తెలంగాణ సీఎం కేసీఆర్‌, ఏపీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి పాల్గొంటారని ఆ శాఖ వర్గాలు తెలిపాయి.


పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచడానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కృష్ణా నదిపై రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ప్రతిపాదించడం, దాన్ని తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకించడం వంటి పరిణామాల నేపథ్యంలో అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఇప్పటికే ఈ సమావేశం రెండుసార్లు వాయిదా పడిన సంగతి తెలిసిందే. 


Updated Date - 2020-09-29T08:19:53+05:30 IST