జడ్జిలపై దాడి ముందస్తు వ్యూహమే: ఏపీసీసీ

ABN , First Publish Date - 2020-10-12T09:15:36+05:30 IST

సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ రమణ, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఇతర జడ్జిలపై సీఎం జగన్‌ ముందస్తు వ్యూహంలో భాగంగానే వైసీపీ దాడులు చేస్తోందని

జడ్జిలపై దాడి ముందస్తు వ్యూహమే: ఏపీసీసీ

అమరావతి, అక్టోబరు 11(ఆంధ్రజ్యోతి): సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ రమణ, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఇతర జడ్జిలపై సీఎం జగన్‌ ముందస్తు వ్యూహంలో భాగంగానే వైసీపీ దాడులు చేస్తోందని ఏపీసీసీ ఆరోపించింది. ముందుగా సామాజిక మాధ్యమాల్లో, తర్వాత వైసీపీ ముఖ్యనేతలు, ఆపై పార్టీకి చెందిన ఇతర నేతలూ న్యాయవ్యవస్థపై దండయాత్రను సాగిస్తూ వచ్చారని పేర్కొంది. జగన్‌ ముగింపును ఇచ్చారని తెలిపింది. సుప్రీంకోర్టు అదేశాలతో తనపై ఉన్న అక్రమాస్తులు, అవినీతి కేసులు విచారణకు రానున్న నేపథ్యంలో.. బెయిల్‌ రద్దయితే పదవి కోల్సోవాల్సి వస్తుందన్న భయంతోనే ముందస్తు ప్రణాళికతో న్యాయవ్యవస్థపై బురద చల్లేలా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి జగన్‌ లేఖలు రాసే కుతంత్రానికి దిగారని ఏపీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల్లో న్యాయవ్యవస్థపై అపనమ్మకం కుదిర్చేందుకు.. తన బెయిల్‌ రద్దు కాకుండా బ్లాక్‌ మెయిల్‌ చేసేందుకే న్యాయవ్యవస్థపై జగన్‌ బురద జల్లుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - 2020-10-12T09:15:36+05:30 IST