-
-
Home » Andhra Pradesh » Apache shoe industry
-
కడపలో అపాచీ పరిశ్రమ..24న సీఎం శంకుస్థాపన
ABN , First Publish Date - 2020-12-10T09:16:04+05:30 IST
నెల్లూరు జిల్లా తడ మండలం మాంబట్టు సెజ్‌లోని అపాచీ బూట్ల పరిశ్రమ తన అనుబంధ ఇండస్ట్రీని కడప జిల్లా పులివెందులలో ఏర్పాటు చేయనుంది. 2007లో మాంబట్టు సెజ్‌లో సుమారు 350 ఎకరాల విస్తీర్ణంలో అపాచీ పరిశ్రమ ఏర్పాటైంది.

తడ, డిసెంబరు 9: నెల్లూరు జిల్లా తడ మండలం మాంబట్టు సెజ్‌లోని అపాచీ బూట్ల పరిశ్రమ తన అనుబంధ ఇండస్ట్రీని కడప జిల్లా పులివెందులలో ఏర్పాటు చేయనుంది. 2007లో మాంబట్టు సెజ్‌లో సుమారు 350 ఎకరాల విస్తీర్ణంలో అపాచీ పరిశ్రమ ఏర్పాటైంది. అయితే, మరోచోట తమ అనుబంధ పరిశ్రమ ఏర్పాటుకు గత కొద్ది సంవత్సరాలుగా ఆ సంస్థ ప్రయత్నిస్తోంది. అయితే, సీఎం జగన్ సొంత నియోజకవర్గం పులివెందులలో ఏర్పాటు చేయాలంటూ ప్రతిపాదన రావడంతో పరిశ్రమ ప్రతినిధులు పులివెందులలో 28 ఎకరాలను పరిశీలించి అంగీకరించారు. ఈ నెల 24న సీఎం జగన్ భూమిపూజ చేసేలా పరిశ్రమ యాజమాన్యం ఏర్పాట్లు చేస్తోంది.