ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ

ABN , First Publish Date - 2020-12-06T21:48:24+05:30 IST

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కారణంగా.. రానున్న రెండు రోజులు ఏపీలో అక్కడక్కడ మోస్తారు వర్షాలు కురవనున్నాయని వాతావరణశాఖ తెలిపింది.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ

అమరావతి: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కారణంగా.. రానున్న రెండు రోజులు ఏపీలో అక్కడక్కడ మోస్తారు వర్షాలు కురవనున్నాయని వాతావరణశాఖ తెలిపింది. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయన్నారు. కృష్ణా, గుంటూరు, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో మోస్తారు వర్షాలు ఉంటాయన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ సూచించింది.  

Read more