ప్రభుత్వ పథకాల్లో అవకతవకలు.. వాలంటీర్లు, సచివాలయం సిబ్బంది సస్పెండ్

ABN , First Publish Date - 2020-12-16T03:22:18+05:30 IST

ప్రభుత్వ సంక్షేమ పథకాలను నేరుగా ప్రజలకందించేందుకు ఏర్పాటు చేసిన వార్డు వాలంటీర్ల, సచివాలయం వ్యవస్థ పక్కదారి పడుతోంది. నిత్యం ప్రజల్లో...

ప్రభుత్వ పథకాల్లో అవకతవకలు.. వాలంటీర్లు, సచివాలయం సిబ్బంది సస్పెండ్

నెల్లూరు: ప్రభుత్వ సంక్షేమ పథకాలను నేరుగా ప్రజలకందించేందుకు ఏర్పాటు చేసిన వార్డు వాలంటీర్లు, సచివాలయం వ్యవస్థ పక్కదారి పడుతోంది. నిత్యం ప్రజల్లో ఉండి సేవలు చేయాల్సింది పోయి పలుచోట్ల అవినీతికి పాల్పడుతున్నారు. లంచాలు డిమాండ్ చేస్తూ ప్రభుత్వ లక్ష్యాన్ని అభాసుపాలు చేస్తున్నారు. సంక్షేమ పథకాలు ప్రజలకు అందించేందుకు అవకతవకలకు పాల్పడుతున్నారు. వెంకటగిరి మున్సిపాలిటీలో నలుగురు వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది అవకతవకలకు పాల్పడ్డారు. ప్రజలు తిరగబడటంతో అవకతవకల బాగోతం బయటపడింది. దీంతో నలుగురు వాలంటీర్లు, సచివాలయ సిబ్బందిని జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అధికారులు సస్పెండ్ చేశారు. 

Updated Date - 2020-12-16T03:22:18+05:30 IST