ఖాకీ నిందితుల్లో ఏపీ టాప్
ABN , First Publish Date - 2020-10-03T07:33:18+05:30 IST
‘రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా అమలవుతోందా?’ అంటూ రాష్ట్ర హైకోర్టు పదే పదే ప్రశ్నిస్తున్న తరుణంలో జాతీయ
దేశవ్యాప్తంగా నమోదైనవి 4,068 కేసులు
అందులో 1,681 కేసులు మన పోలీ్‌సపైనే
జాతీయ నేర గణాంకాల నివేదిక వెల్లడి
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
‘రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా అమలవుతోందా?’ అంటూ రాష్ట్ర హైకోర్టు పదే పదే ప్రశ్నిస్తున్న తరుణంలో జాతీయ నేర గణాంకాల నివేదిక(ఎన్‌సీఆర్‌బీ) వెలువడింది. పోలీసులపై 2019లో దాఖలైన ఎఫ్‌ఐఆర్‌లు, కేసులు, అరెస్టులు, అభియోగపత్రాలపై అందిన వివరాలతో ఇది తయారైంది. ఏపీలో పోలీసుల తీరుతెన్నులపై విస్మయపరిచే లెక్కలను బయటపెట్టింది. ఏపీ పోలీస్‌లపై గత ఏడాది పెద్దఎత్తున కేసులు నమోదయ్యాయి.
దేశంలోని 29 రాష్ట్రాలు, కేంద్రపాలితప్రాంతాల్లో పోలీసులపై నమోదై న కేసులన్నీ కలిపితే 4,068. అందులో ఒక్క ఏపీ పోలీసుల వా టానే 41ు. ఏకంగా 1,681 కేసులు రాష్ట్రంలోని వివిధ పోలీసు స్టేషన్లలో నమోదయ్యాయి. వరకట్న వేధింపుల మొదలుకొని లాకప్ డెత్‌ల వరకూ ఇందులో ఎన్నో రకాల కేసులున్నాయి.
మరకలో పోలికే లేదు..
దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో పోలీసుల సంఖ్య నాలుగు లక్షలు. ఒకనాడు అరాచకాలకు నిలయమైన ఆ రాష్ట్రంలో పోలీసులపై కేవలం 161 కేసులు నమోదయ్యాయి. కానీ మన పోలీసులపై వందల్లో కేసులు నమోదయ్యాయి. రెం డు తెలుగు రాష్ట్రాల కన్నా పెద్దదైన మహారాష్ట్రలో పోలీసులపై 403 కేసులు నమోదయ్యాయి. ఏపీతో పోలిస్తే మహారాష్ట్రలో నమోదైన కేసులు 76శాతం తక్కువ.
కాగా, రాష్ట్ర పోలీసులపై నమోదైన 1,681 కేసుల్లో 302 కేసులకు సంబంధించి దర్యాప్తు పూర్తి చేసి కోర్టుల్లో చార్జిషీట్లు దాఖలు చేసినట్లు ఎన్‌సీఆర్‌బీకి పోలీసుశాఖ వివరాలు పంపింది. వీటిలో కోర్టుల్లో విచారణ పూ ర్తి అయినవి ఎనిమిది కాగా, అన్నింట్లోనూ సరైన ఆధారాలు లే కపోవడంతో కోర్టు కొట్టేసింది. మరికొన్ని కేసుల్లో విచారణ దాకా రాకముందే ఫిర్యాదుదారులు ఉపసంహరించుకొన్నారు.
ఇన్ని కేసుల్లో ఇప్పటిదాకా పోలీసుల అరెస్టులు జరిగింది కేవలం 85 కేసుల్లోనే.. ఇది తమవారిపై దర్యాప్తు అధికారులకున్న ప్రేమకు నిదర్శనమని మానవ హక్కుల కార్యకర్తలు, సామాజిక ఉద్యమకారులు ఆక్షేపిస్తున్నారు.