-
-
Home » Andhra Pradesh » AP State Judicial Employees
-
జ్యుడీషియల్ ఉద్యోగులకు సెలవులివ్వాలని వినతి
ABN , First Publish Date - 2020-03-24T09:51:13+05:30 IST
రాష్ట్రంలోని వివిధ కోర్టులలో పని చేస్తున్న జ్యుడీషియల్ ఉద్యోగులకు కొంతకాలం సెలవులు ప్రకటించాలని ఏపీ రాష్ట్ర జ్యుడీషియల్ ఎంప్లాయీస్ ...

మంగళగిరి, మార్చి 23: రాష్ట్రంలోని వివిధ కోర్టులలో పని చేస్తున్న జ్యుడీషియల్ ఉద్యోగులకు కొంతకాలం సెలవులు ప్రకటించాలని ఏపీ రాష్ట్ర జ్యుడీషియల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రతినిధులు కోరారు. ఈ మేరకు సోమవారం హైకోర్టు రిజిస్ర్టార్ జనరల్ రాజశేఖర్‌ను కలిసి వినతిపత్రం అందించారు. కరోనా నేపథ్యంలో జ్యుడీషియల్ రాష్ట్ర ఉద్యోగులు, న్యాయవాదులు, కక్షిదారుల ఆరోగ్య జాగ్రత్తలను సైతం దృష్టిలో ఉంచుకుని సెలవులు మంజూరు చేయాలని కోరినట్టు అసోసియేషన్ రాష్ట్ర కోశాధికారి పీఎన్ మల్లేశ్వరరావు చెప్పారు. ఈ విషయాన్ని సీజే దృష్టికి తీసుకెళ్లి, పరిష్కారానికి కృషి చేస్తానని రిజిస్ర్టార్ జనరల్ హామీ ఇచ్చారన్నారు.