ఏపీ కరోనా బులెటిన్.. రోజురోజుకు పెరుగుతున్న కేసులు
ABN , First Publish Date - 2020-06-08T19:21:24+05:30 IST
ఏపీ కరోనా కేసుల తాజా బులెటిన్‌ను వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ విడుదల చేసింది. తాజా వివరాల ప్రకారం
ఇంటర్నెట్ డెస్క్: ఏపీ కరోనా కేసుల తాజా బులెటిన్‌ను వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ విడుదల చేసింది. తాజా వివరాల ప్రకారం గత 24 గంటల్లో మొత్తం 154 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్తగా 14,246 శాంపిల్స్‌ను పరీక్షించగా 125 మంది కోవిడ్ 19 పాజిటివ్‌గా తేలారు. 34 మంది కోవిడ్ నుంచి కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యారు. ఇదిలా ఉంటే.. ఇతర ప్రదేశాల నుంచి వచ్చిన 29 మంది కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యారు. మొత్తంగా చూసుకుంటే 154 కేసులు నమోదయ్యాయని అధికారులు తెలిపారు. ఎలాంటి మరణాలు సంభవించలేదన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం 3843 కేసుల్లో 2387 మంది డిశ్చార్జ్ కాగా 75 మంది మరణించారు. ప్రస్తుతం 1381 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
