ఏపీకి రూ.1892 కోట్లు విడుదల
ABN , First Publish Date - 2020-04-21T12:02:37+05:30 IST
ఏపీకి రూ.1892 కోట్లు విడుదల

న్యూఢిల్లీ(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం కేంద్ర పన్నులు, డ్యూటీలో వాటా కింద రూ. 1892.64 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 15వ ఆర్థిక సంఘం సిఫారసు ప్రకారం ఏప్రిల్ నెలకు సంబంధించిన వాటాను విడుదల చేస్తున్నట్లు తెలిపింది.