17 వరకు ఏపీలో భారీ వర్షాలు

ABN , First Publish Date - 2020-09-14T12:36:28+05:30 IST

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఆదివారం ఉత్తరాంధ్ర తీరంలో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఈ రోజు మరింత బలపడే అవకాశం ఉంది.

17 వరకు ఏపీలో భారీ వర్షాలు

అమరావతి: బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఆదివారం ఉత్తరాంధ్ర తీరంలో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఈ రోజు మరింత  బలపడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఈ నెల 17 వరకు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు పడే అవకాశాలు  ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. కోస్తా తీరం వెంబడి బలమైన గాలులు వీచే అవకాశం ఉంది. మరోవైపు ఈ నెల 20న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం అమరవతి వాతావరణ కేంద్రం అధికారులు తెలియజేశారు. 

Updated Date - 2020-09-14T12:36:28+05:30 IST