పోలీసులతో బెదిరిస్తారా!

ABN , First Publish Date - 2020-03-08T10:53:44+05:30 IST

పోలీసులతో బెదిరిస్తారా!

పోలీసులతో బెదిరిస్తారా!

రైతులను నెట్టేస్తారా?.. రాజధానిలో భూముల చదునుపై చంద్రబాబు ఫైర్‌

అమరావతి, మార్చి 7 (ఆంధ్రజ్యోతి): ‘‘రాజధానిలోని ఐనవోలు, మందడం గ్రామాల్లోని భూముల్లో రైతులను బలవంతంగా నెట్టేసి, అర్ధరాత్రి పోలీసు పహారాతో భూమి చదును చేయడం, అరెస్ట్‌ చేస్తామని, లాఠీచార్జ్‌ చేస్తామని బెదిరించడం సరైంది కాదు’’ అని మాజీ సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తంచేశారు. భూములు కొని పేదలకు ఇవ్వాలనీ, రాజధానికి విరాళంగా ఇచ్చిన భూముల్లో ఇవ్వడం రైతులను దగా చేయడమేనని మండిపడ్డారు. ఇలాంటి దుర్మార్గ చర్యలకు ఇకనైనా వైసీపీ నేతలు స్వస్తి చెప్పాలన్నారు. రైతులు, పేదల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే చర్యలు సరికాదని హితవు పలికారు. 

Updated Date - 2020-03-08T10:53:44+05:30 IST