పోలవరంలో అవకతవకలు లేవు

ABN , First Publish Date - 2020-03-08T10:40:56+05:30 IST

పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టులో అవినీతి అంటూ వైసీపీ ప్రభుత్వం పదేపదే చేస్తున్న ఆరోపణలు అవాస్తవమేనా? ‘రివర్స్‌ టెండర్‌’ బాటపట్టడానికి కారణంగా చెప్తున్న ‘ప్రజాధనం దుర్వినియోగం’ అంతా ఉత్తమాటేనా? ఔను...

పోలవరంలో అవకతవకలు లేవు

కేంద్ర జలశక్తి శాఖకు రాష్ట్రం లేఖ..

పీఎంవోకు అధికారుల వివరణ


న్యూఢిల్లీ, మార్చి 7(ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టులో అవినీతి అంటూ వైసీపీ ప్రభుత్వం పదేపదే చేస్తున్న ఆరోపణలు అవాస్తవమేనా? ‘రివర్స్‌ టెండర్‌’ బాటపట్టడానికి కారణంగా చెప్తున్న ‘ప్రజాధనం దుర్వినియోగం’ అంతా ఉత్తమాటేనా? ఔను... అవన్నీ అవాస్తవాలే! ఏకంగా రాష్ట్ర ప్రభుత్వమే ఈ విషయం ఒప్పుకొంది!ప్రాజెక్టు పనుల కాంట్రాక్టుకు సంబంధించి నిబంధనలపరంగా ఎలాంటి ఉల్లంఘనలూ లేవని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్రానికి లేఖ రాసింది. సంబంధిత అథారిటీ ఆమోదముద్ర లభించిన తర్వాతే అన్ని నిర్ణయాలు తీసుకున్నట్లు జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం 2019 నవంబరు 13న తమకు లేఖ రాసినట్లు కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ సీనియర్‌ జాయింట్‌ కమిషనర్‌ అనూప్‌ శ్రీవాత్సవ తెలిపారు. ఈ విషయాన్ని పీఎంవో దృష్టికి తీసుకెళ్లారు. 

Updated Date - 2020-03-08T10:40:56+05:30 IST