ఏపీలో కరోనా కట్టడికి ‘ఫార్మా యాప్’
ABN , First Publish Date - 2020-04-26T21:38:47+05:30 IST
ఏపీలో కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా ఫార్మసీ యాప్‌ను రూపొందించారు. మెడికల్ షాపుల

అమరావతి: ఏపీలో కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా ఫార్మసీ యాప్‌ను రూపొందించారు. మెడికల్ షాపుల యజమానులు తమ మొబైల్ నంబర్ ద్వారా లాగిన్ అవ్వాలని ఆదేశించారు. ఎంటర్ చేసిన మొబైల్ నెంబర్‌కు ఒటిపి వస్తుందని, మొబైల్ నంబర్ లేదా మెడికల్ షాపు ఐడి నంబర్‌ను ఎంటర్ చేయాలని సూచించారు. జ్వరం, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలతో మెడికల్ షాపులకొచ్చే వారి వివరాలను ఈ యాప్‌లో పొందుపర్చాలని సూచించారు. స్థానిక ప్రభుత్వ మెడికల్ ఆఫీసర్ వచ్చి సంబంధిత వ్యక్తులకు స్వయంగా చికిత్స అందిస్తారని అధికారులు పేర్కొన్నారు. గూగుల్ ప్లే స్టోర్ నుంచి Covid 19 AP Pharma యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చునని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు చెప్పారు. కరోనాపై పోరాటంలో మెడికల్ షాపుల యజమానులు ప్రభుత్వానికి సహకరించాలన్నారు.