కేఆర్ఎంబీ ఛైర్మన్‌ను కలవనున్న ఏపీ అధికారులు

ABN , First Publish Date - 2020-05-18T20:40:27+05:30 IST

కృష్ణా ట్రిబ్యునల్ కేటాయింపులపై సోమవారం కేఆర్ఎంబీ ఛైర్మన్‌ను..

కేఆర్ఎంబీ ఛైర్మన్‌ను కలవనున్న ఏపీ అధికారులు

అమరావతి: కృష్ణా ట్రిబ్యునల్ కేటాయింపులపై సోమవారం కేఆర్ఎంబీ ఛైర్మన్‌ను ఏపీ జలవనరుల శాఖ అధికారులు కలవనున్నారు. ఏపీకి ఉన్న జలహక్కులను వినియోగించుకుంటూ పోతిరెడ్డిపాటు విస్తరణ చేపట్టనున్నామని, కృష్ణానది యాజమాన్యం బోర్డుకు వివరించునున్నారు. కృష్ణా వరద జలాలను పోతిరెడ్దిపాడు ద్వారా సీమకు మళ్లించేందుకే 203 జీవో జారీ చేశామని ఛైర్మన్ దృష్టికి తీసుకురానున్నారు. పోతిరెడ్డిపాడు పనులు ఎందుకు చేయాల్సి వస్తుందో అధికారులు వివరించనున్నారు.

Updated Date - 2020-05-18T20:40:27+05:30 IST