స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పుడే వద్దు : ఏపీఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడు

ABN , First Publish Date - 2020-12-23T00:58:28+05:30 IST

కరోనా వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుని స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఏపీఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఇదే అంశమై మంగళవారం నాడు ఇక్కడ

స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పుడే వద్దు : ఏపీఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడు

గుంటూరు: కరోనా వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుని స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఏపీఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఇదే అంశమై మంగళవారం నాడు ఇక్కడ మీడియాతో మాట్లాడిన ఆయన.. కరోనా కారణంగా తెలంగాణలో ఓటింగ్ శాతం తక్కువగా నమోదైన విషయాన్ని ప్రస్తావించారు. చాలా మంది ఉద్యోగులు కూడా కోవిడ్ భారిన పడ్డారని అన్నారు. గ్రామ సచివాలయాల పని తీరు బాగుందని, ప్రధాని మోదీ సైతం మెచ్చుకున్నారని చంద్రశేఖర్ రెడ్డి గుర్తు చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఉద్యోగులు ఇంటింటికి చేర్చడంపై ప్రజలు సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. ఇదే సమయంలో మూడు రాజధానుల అంశంపైనా ఆయన చంద్రశేఖర్ రెడ్డి స్పందించారు. మూడు రాజధానుల నిర్ణయానికి ఏపీఎన్జీఓ సంపూర్ణ మద్దతు ఉంటుందని ప్రకటించారు. మూడు రాజధానుల వలన అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతుందన్నారు. కేంద్రం ఉద్యోగులకు ఇచ్చే డీఏలను ఆపాలని చెప్పడం సరికాదన్నారు. కోవిడ్ సమయంలో కష్టపడి పని చేసిన ఉద్యోగులకు వెంటనే డీఏలు విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఎన్నికల హామీ మేరకు సీపీఎస్‌ను రద్దు చేయాలన్నారు. పీఆర్సీని వెంటనే ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని చంద్రశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు.

Updated Date - 2020-12-23T00:58:28+05:30 IST