-
-
Home » Andhra Pradesh » ap news
-
కార్పొరేట్ మాయలో పడొద్దు
ABN , First Publish Date - 2020-12-19T07:27:39+05:30 IST
‘కార్పొరేట్ పాఠశాలల మేనేజ్‌మెంట్ల మాయలో పడొద్దు. అన్ని సౌకర్యాలు ఉన్న ప్రభుత్వ స్కూళ్లలో పిల్లల్ని చేర్పించండి’

పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ పిలుపు
అమరావతి, డిసెంబరు 18(ఆంధ్రజ్యోతి): ‘కార్పొరేట్ పాఠశాలల మేనేజ్‌మెంట్ల మాయలో పడొద్దు. అన్ని సౌకర్యాలు ఉన్న ప్రభుత్వ స్కూళ్లలో పిల్లల్ని చేర్పించండి’ అని ఏపీ పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ తల్లిదండ్రులకు పిలుపునిచ్చింది. ‘నాడు-నేడు’ కార్యక్రమం కింద ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని సౌకర్యాలను ప్రభుత్వం కల్పిస్తోందని తెలిపింది. తల్లిదండ్రులు అప్పులు చేయకుండా అన్నీ ఉచితంగా సమకూర్చే ప్రభుత్వ స్కూళ్లకు పిల్లల్ని పంపిస్తే... న్యాయం చేస్తామని భరోసా ఇచ్చింది. రెగ్యులేటరీ కమిషన్ ఇబ్రహీంపట్నంలోని తన కార్యాలయంలో శుక్రవారం సమావేశమై ‘నాడు-నేడు’ తొలి దశ పనులపై భాగస్వాములతో చర్చించింది. క్షేత్రస్థాయిలో గుర్తించిన సమస్యలను, లోటుపాట్ల గురించి ఆరా తీసింది.