రెండు వర్సిటీల వీసీల నియామకానికి సెర్చ్‌ కమిటీల భేటీ

ABN , First Publish Date - 2020-12-13T09:23:51+05:30 IST

రెండు వర్సిటీల వీసీల నియామకానికి సెర్చ్‌ కమిటీల భేటీ

రెండు వర్సిటీల వీసీల నియామకానికి సెర్చ్‌ కమిటీల భేటీ

జేఎన్‌టీయూఎ (అనంతపూరం), డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌ యూనివర్సిటీ (శ్రీకాకుళం)లకు కొత్త వైస్‌ చాన్సెలర్ల నియామకం కోసం సెర్చ్‌ కమిటీలు హైదరాబాద్‌లో సమావేశమయ్యాయి. ఒక్కో వర్సిటీకి మూడు పేర్లతో సిఫారసుల జాబితాను ప్రభుత్వానికి పంపించాయి. సెర్చ్‌ కమిటీల నియామకం జరిగిన వారం రోజుల్లోనే భేటీ కావడం విశేషం. త్వరలోనే సంబంధిత ఫైలును గవర్నర్‌కు పంపనున్నారని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇదిలా ఉండగా ఆచార్య నాగార్జున వీసీ నియామకానికి సంబంధించిన ఫైలు ఇంకా సీఎంఓ లోనే ఉన్నట్లు సమాచారం.

Updated Date - 2020-12-13T09:23:51+05:30 IST