ధాన్యం కొనుగోలులో సడలింపులు

ABN , First Publish Date - 2020-12-03T08:55:41+05:30 IST

ధాన్యం కొనుగోలులో సడలింపులు

ధాన్యం కొనుగోలులో సడలింపులు

రంగుమారిన, మొలకెత్తిన, పురుగుపట్టిన ధాన్యం కొనుగోలు

పరిమితి 10 శాతం వరకు పెంపు


అమరావతి, డిసెంబరు 2(ఆంధ్రజ్యోతి): ఇటీవల కురిసిన వర్షాల కారణంగా వరిసాగు భారీగా దెబ్బతిన్న నేపథ్యంలో పౌరసరఫరాల శాఖ ధాన్యం కొనుగోలులో సడలింపులు ఇచ్చింది. రంగుమారిన, మొలకెత్తిన, పురుగుపట్టిన ధాన్యం కొనుగోలు పరిమితి ఇప్పటి వరకు 5ు ఉండగా, దాన్ని 10ుకి పెంచింది. ఈ మేరకు పౌరసరఫరాల శాఖ ఎక్స్‌ అఫిషియో కార్యదర్శి కోన శశిధర్‌ బుధవారం ఆదేశాలు జారీ చేశారు. నివర్‌ తుఫానుతో వరి తీవ్రంగా దెబ్బతిన్నందున ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. దీనికిగాను కొనుగోలు కేంద్రాల వద్ద సహాయ కేంద్రాలు ఏర్పాటుచేసినట్టు తెలిపారు.


రాష్ట్రంలో 2,578 కొనుగోలు కేంద్రాలు అందుబాటులో ఉన్నాయని, 6,643 రైతు భరోసా కేంద్రాలను వీటికి అనుసంధానం చేశామని వివరించారు. రైతులకు మరింత సమాచారం కోసం పౌరసరఫరాల శాఖ 08812230448 టోల్‌ఫ్రీ నెంబరు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఇదిలావుంటే, దెబ్బతిన్న పంటల పరిశీలనకు కేంద్రం నుంచి వచ్చిన రెండు బృందాలు గత రెండు రోజులుగా రాష్ట్రంలో పర్యటిస్తున్నాయి. బుధవారం పౌరసరఫరాల శాఖ కమిషనర్‌తో కలిసి కృష్ణా జిల్లాలోని పలు ప్రాంతాల్లో నీటమునిగిన పంటలను ఈ బృందాలు పరిశీలించాయి. 

Updated Date - 2020-12-03T08:55:41+05:30 IST