పోతుల సునీత రాజీనామా ఆమోదం

ABN , First Publish Date - 2020-12-01T08:46:44+05:30 IST

పోతుల సునీత రాజీనామా ఆమోదం

పోతుల సునీత రాజీనామా ఆమోదం

అమరావతి, నవంబరు 30(ఆంధ్రజ్యోతి): ఎమ్మెల్సీ పోతుల సునీత రాజీనామాను ఆమోదిస్తున్నట్లు చైర్మన్‌ ఎంఏ షరీఫ్‌ సోమవారం సభలో ప్రకటించారు. 2020 నవంబరు 11 నుంచి ఆమె రాజీనామా అమలులోకి వస్తుందని తెలిపారు. 


టిడ్కో ఇళ్లపై నివేదిక ఇవ్వండి: సోము

రాష్ట్రంలో టిడ్కో ఇళ్ల నిర్మాణంపై ప్రభుత్వం పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు శాసనమండలిలో ప్రత్యేక ప్రస్తావనలో(స్పెషల్‌ మోషన్‌) డిమాండ్‌ చేశారు. కాగా, సీపీఎస్‌ రద్దు చేసి.. ఓపీఎస్‌ అమలు చేస్తారో.. లేదో? చెప్పాలని ఎమ్మెల్సీ ఏఎస్‌ రామకృష్ణ డిమాండ్‌ చేశారు. 


నలుగురు ప్యానల్‌ వైస్‌ చైర్మన్లు ఎంపిక

శాసన మండలిలో ప్యానల్‌ వైస్‌ చైర్మన్లుగా జంగా కృష్ణమూర్తి, గుమ్మడి సంధ్యారాణి, చిక్కాల రామచంద్రరావు, కేఎస్‌ లక్ష్మణరావులను నామినేట్‌ చేసినట్లు చైర్మన్‌ ఎంఏ షరీఫ్‌ తెలిపారు.

Updated Date - 2020-12-01T08:46:44+05:30 IST