వ్యవసాయ పాలిటెక్నిక్‌ ఫలితాలు విడుదల

ABN , First Publish Date - 2020-11-27T09:57:19+05:30 IST

ఆచార్య ఎన్‌.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆన్‌లైన్‌ పద్ధతిలో నిర్వహించిన అగ్రిసెట్‌-2020 ఫలితాలను వీసీ ఆదాల విష్ణువర్ధన్‌రెడ్డి గురువారం విడుదల చేశారు.

వ్యవసాయ పాలిటెక్నిక్‌ ఫలితాలు విడుదల

అమరావతి, లాంఫాం(తాడికొండ,) నవంబరు 26: ఆచార్య ఎన్‌.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆన్‌లైన్‌ పద్ధతిలో నిర్వహించిన అగ్రిసెట్‌-2020 ఫలితాలను వీసీ ఆదాల విష్ణువర్ధన్‌రెడ్డి గురువారం విడుదల చేశారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 2,807 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరవ్వగా 2,746 మంది ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు. వ్యవసాయ పాలిటెక్నిక్‌లో 2,433 మంది, విత్తన సాంకేతిక పాలిటెక్నిక్‌లో 242 మంది, సేంద్రీయ వ్యవసాయ పాలిటెక్నిక్‌లో 71 మంది అభ్యర్థులు ఉత్తీర్ణత పొందారన్నారు.

Read more