‘ఉపా’ కేసులు ఎత్తేయాలి: ఏపీసీఎల్సీ

ABN , First Publish Date - 2020-11-27T08:55:29+05:30 IST

‘‘హక్కుల, ప్రజా సంఘాలపై ఉపా చట్టం ప్రయోగించడం దారుణం. విశాఖ జిల్లా ముంచింగిపుట్టు, గుంటూరు జిల్లా పిడుగురాళ్ల పోలీస్‌ స్టేషన్లలో హక్కుల,

‘ఉపా’ కేసులు ఎత్తేయాలి: ఏపీసీఎల్సీ

గుంటూరు, నవంబరు 26: ‘‘హక్కుల, ప్రజా సంఘాలపై ఉపా చట్టం ప్రయోగించడం దారుణం. విశాఖ జిల్లా ముంచింగిపుట్టు, గుంటూరు జిల్లా పిడుగురాళ్ల పోలీస్‌ స్టేషన్లలో హక్కుల, ప్రజా సంఘాల నాయకులపై ఉపా చట్టం కింద కేసులు నమోదు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం’’ అని ఏపీ పౌరహక్కుల సంఘం అధ్యక్షుడు వేడంగి చిట్టిబాబు, కార్యదర్శి చిలుకా చంద్రశేఖర్‌ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ రెండు కేసులను బేషరతుగా ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు.

Read more