-
-
Home » Andhra Pradesh » AP NEWS
-
గడువులో పే పోలవరం!
ABN , First Publish Date - 2020-11-21T09:30:12+05:30 IST
గడువులో పే పోలవరం!

భోగాపురం విమానాశ్రయం మొదలైతే విశాఖ ఎయిర్‌పోర్టును
మూసేయాలన్నా.. అందులో తప్పేముంది?: విజయసాయి
విశాఖపట్నం, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టును నిర్ణీత గడువు డిసెంబరు 2021 నాటికి పూర్తి చేస్తామని, అక్కడ పనులు శరవేగంతో జరుగుతున్నాయని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ప్రాజెక్టుపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు. శనివారం విశాఖ కలెక్టర్ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రతిపక్షం నిర్మాణాత్మక పాత్ర పోషించకుండా స్వార్థ, వర్గ ప్రయోజనాల కోసం పనిచేస్తోందని ఆరోపించారు.
తెలుగుదేశం ఎన్నారై పార్టీ అని.. పొరుగు రాష్ట్రంలో ఉండి చంద్రబాబు, లోకేశ్ పార్టీని నడిపిస్తున్నారని విమర్శించారు. ‘రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ రాజ్యాంగబద్ధ సంస్థకు ప్రతినిధినని మరిచిపోయి చంద్రబాబుకు తొత్తుగా వ్యవహరిస్తున్నారు. టీడీపీ నాయకులు కూడా చంద్రబాబును నమ్మడం మానేసి నిమ్మగడ్డపైనే ఆశలు పెంచుకుంటున్నారు. త్వరలో ఆయన్ను ఆ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్‌గా చేసినా ఆశ్చర్యపోనవసరం లేదు. విశాఖ విమానాశ్రయం నేవీది.. భోగాపురంలో కార్యాకలాపాలు ప్రారంభమైతే.. దీనిని మూసేయాలని కోరాం. అందులో తప్పేముంది? సీపీఐ, సీపీఎం, జనసేన నాయకులు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు’ అని ధ్వజమెత్తారు.