నిర్మలా సీతారామన్‌ను కలిసిన ఏపీ మంత్రి బుగ్గన

ABN , First Publish Date - 2020-07-10T20:03:10+05:30 IST

కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను ఏపీ మంత్రి బుగ్గన కలిసారు.

నిర్మలా సీతారామన్‌ను కలిసిన ఏపీ మంత్రి బుగ్గన

న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంధ్రనాథ్ రెడ్డి కలిశారు. అనంతరం బుగ్గన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులపై చర్చించామన్నారు. కరోనాతో రాష్ట్రంపై ఆర్థికంగా ఇబ్బందులు పడ్డాయని అయితే ఈ ఇబ్బందుల విషయాన్ని కేంద్రమంత్రికి వివరించామని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు, వెనుకబడిన ప్రాంతాలకు సంబంధించి రావాల్సిన నిధులు తదితరవాటిపై కేంద్రమంత్రితో చర్చించి.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరించామని మంత్రి బుగ్గన చెప్పారు.

Updated Date - 2020-07-10T20:03:10+05:30 IST