క్షయ నివారణలో ఏపీకి రెండో స్థానం

ABN , First Publish Date - 2020-06-25T08:17:22+05:30 IST

క్షయ వ్యాధి నివారణ, నియంత్రణలో దేశంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ర్టానికి ద్వితీయ స్థానం లభించింది.

క్షయ నివారణలో ఏపీకి రెండో స్థానం

అమరావతి, జూన్‌ 24(ఆంధ్రజ్యోతి): క్షయ వ్యాధి నివారణ, నియంత్రణలో దేశంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ర్టానికి ద్వితీయ స్థానం లభించింది.కేంద్ర ప్రభుత్వం బుధవారం ఇండియా టీబీ రిపోర్టు 2020ని విడుదల చేసింది. మొత్తంగా దేశాన్ని 3 కేటగిరిలుగా విభజించారు. రాష్ట్ర జనాభా 50 లక్షలు పైన ఉన్న రాష్ట్రాలు మొదటి కేటగిరి, 50 లక్షల లోపు ఉన్న రాష్ట్రాలు రెండో కేటగిరి, కేంద్ర పాలిత ప్రాంతాలు మూడో కేటగిరి కాగా, ఏపీ మొదటి కేటగిరిలో రెండో స్థానంలో నిలిచింది. 

Updated Date - 2020-06-25T08:17:22+05:30 IST