అమరావతిని ‘ముంచిన’ సలహాకు రూ.7 కోట్లు!

ABN , First Publish Date - 2020-03-24T10:17:00+05:30 IST

తన ఆదేశానుసారం పరిపాలనా వికేంద్రీకరణ అనే ‘వినూత్న కాన్సె్‌ప్ట’తో ఆంధ్రప్రదేశ్‌కు మూడు రాజధానులు ఉండాలని సిఫారసు ...

అమరావతిని ‘ముంచిన’ సలహాకు రూ.7 కోట్లు!

బీసీజీకి మంజూరుచేసిన ప్రభుత్వం

అమరావతి, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): తన ఆదేశానుసారం పరిపాలనా వికేంద్రీకరణ అనే ‘వినూత్న కాన్సె్‌ప్ట’తో ఆంధ్రప్రదేశ్‌కు మూడు రాజధానులు ఉండాలని సిఫారసు చేసిన బీసీజీ (బోస్టన్‌ కన్సల్టింగ్‌ గ్రూప్‌) సంస్థకు రాష్ట్రప్రభుత్వం రూ.7.02 కోట్లు మంజూరుచేసింది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. అమరావతికి ముంపు బెడద ఉందంటూ ప్రభుత్వ పెద్దలు చేస్తున్న ప్రకటనలకు ‘సాధికారత’ చేకూర్చేందుకు మద్రాస్‌ ఐఐటీ ఇదే చెప్పిందని బీసీజీ తన నివేదికలో పేర్కొంది. అలాంటి నివేదికేదీ తామివ్వలేదని.. అలాంటి విభాగమే తమ వద్ద లేదని ఆ ఐఐటీ రాజధాని ప్రాంత రైతులకు స్పష్టం చేయడం వేరే విషయం. రాష్ట్ర ప్రణాళికా శాఖ, ఇతర ప్రభుత్వ విభాగాలు, సంస్థల వద్ద అప్పటికే సిద్ధంగా ఉన్న ‘మెటీరియల్‌’ను తీసుకుని ‘కట్‌ అండ్‌ పేస్ట్‌’ చేసి, అక్కడక్కడా కొద్దిపాటి మార్పు చేర్పులతో నివేదిక రూపొందించింది. కొన్ని విదేశీ నగరాలతో పోల్చడం ద్వారా ‘అంతర్జాతీయ కలరింగ్‌’ ఇచ్చింది. గత ఏడాది నవంబరు 27న బీసీజీని ఎంపిక చేయగా.. రాష్ట్రంలో ఎక్కడా పర్యటించకుండానే రెండు వారాలకే మధ్యంతర నివేదిక ఇచ్చింది.


ఆ తర్వాత మూడు వారాల్లోపే తుది నివేదికనూ సమర్పించేసింది. రాష్ట్రం అన్ని రంగాల్లో సర్వతోముఖాభివృద్ధి సాధించాలంటే 3 రాజధానులు ఉండాలని.. శాసన రాజధానిగా అమరావతి, పరిపాలనా రాజధానగా విశాఖపట్నం, న్యాయ రాజధానిగా కర్నూలు ఉండాలని అందులో పేర్కొంది. చంద్రబాబు ప్రభుత్వ హయాంలోనే మొదలై ఆయా జిల్లాల్లో అమలవుతున్న పలు కార్యక్రమాలను తన నివేదికలో పొందుపరిచింది. వీటన్నిటినీ అమలు చేయాలని సిఫారసుచేసింది. రాష్ట్ర ప్రణాళికా శాఖ, ఇతర ప్రభుత్వ విభాగాలు, సంస్థల వద్ద అప్పటికే సిద్ధంగా ఉన్న ‘మెటీరియల్‌’ను తీసుకుని ‘కట్‌ అండ్‌ పేస్ట్‌’ చేసి, అక్కడక్కడా కొద్దిపాటి మార్పు చేర్పులతో నివేదిక రూపొందించింది. ఈ సంస్థకు అసలు విశ్వసనీయతే లేదని.. కొన్ని దేశాల్లో కేసులు నమోదై ఉన్నాయని.. బ్లాక్‌లిస్టులో పెట్టారని టీడీపీ నేతలు ఆరోపణలు గుప్పించారు. పైగా ప్రస్తుత ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్న ఎంపీ విజయసాయిరెడ్డి అల్లుడి స్నేహితుడొకరు ఈ సంస్థలో కీలక స్థానంలో ఉన్నారని, అందువల్లే ఈ రిపోర్టును రూపొందించే బాధ్యతను బీసీజీకి ఇచ్చారనీ విమర్శించారు. ఎవరెన్ని అన్నప్పటికీ.. బీసీజీకి అక్షరాలా రూ.7.02 కోట్ల ప్రజాఽధనాన్ని ఫీజుగా మంజూరు చేస్తూ ప్రభుత్వం ఆదేశాలిచ్చేసింది.

Read more