స్థానిక ఎన్నికల్లో అక్రమాలపై ఏపీ హైకోర్టులో పిటిషన్‌

ABN , First Publish Date - 2020-03-16T00:47:48+05:30 IST

స్థానిక ఎన్నికల్లో అక్రమాలపై ఏపీ హైకోర్టులో పిటిషన్‌

స్థానిక ఎన్నికల్లో అక్రమాలపై ఏపీ హైకోర్టులో పిటిషన్‌

గుంటూరు: స్థానిక ఎన్నికల్లో అక్రమాలపై హైకోర్టులో టీడీపీ నేత కోవెలమూడి రవీంద్ర పిటిషన్‌ దాఖలు చేశారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అధికారులు ఏం చర్యలు తీసుకున్నారో సోమవారంలోగా చెప్పాలని హైకోర్టు ఆదేశించింది. ఈసీకి విశేష అధికారాలు ఉంటాయని హైకోర్టు సీజే స్పష్టం చేశారు. హైకోర్టు ఆగ్రహంతోనే అధికారులపై ఈసీ చర్యలు తీసుకుందని, గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని, తమ దగ్గర ఉన్న ఆధారాలు కోర్టుకు సమర్పించామని రవీంద్ర తెలిపారు. ఎన్నికల ప్రక్రియ మొత్తం రద్దు చేసి మరో నోటిఫికేషన్‌ ఇవ్వాలన్నారు. విచక్షణాధికారులంటే తెలియని వ్యక్తి సీఎం కావడం దౌర్బగ్యమని రవీంద్ర అన్నారు.

Updated Date - 2020-03-16T00:47:48+05:30 IST