-
-
Home » Andhra Pradesh » ap high court migrant workers video conference
-
వలస కార్మికుల తరలింపుపై హైకోర్టులో విచారణ
ABN , First Publish Date - 2020-06-24T01:10:13+05:30 IST
వలస కార్మికులను వారి వారి స్వస్థలాలకు తరలింపుపై నేడు హైకోర్టులో విచారణ జరిగింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఈ విచారణకు దక్షిణ మధ్య రైల్వే డీఆర్ఎం ఆనంద్ భాటియా

అమరావతి: వలస కార్మికులను వారి వారి స్వస్థలాలకు తరలింపుపై నేడు హైకోర్టులో విచారణ జరిగింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఈ విచారణకు దక్షిణ మధ్య రైల్వే డీఆర్ఎం ఆనంద్ భాటియా హాజరయ్యారు. ప్రత్యేకంగా అదనపు బోగీలు ఏర్పాటు చేయడం సాంకేతికంగా వీలుకాదని డీఆర్ఎం తేల్చి చెప్పారు. బీహార్‌కు చెందిన 45 మంది వలస కూలీలను బుధవారం వారి స్వస్థలాలకు చేరుస్తామని తెలిపారు. అత్యవసర కోటాలో రేపటి రైళ్లలో టికెట్లు ఖరారు చేస్తామని డీఆర్ఎం తెలిపారు. కలెక్టర్లు కోరితే రోజుకు 50 మంది వలస కూలీలకు ఈక్యూలో టికెట్లు కేటాయించేందుకు సిద్ధం అని చెప్పారు. కాగా, డీఆర్ఎం వివరణ నేపథ్యంలో స్పందించిన హైకోర్టు.. వలస కార్మికులందరూ స్వస్థలాలకు చేరే వరకు ఇదే విధానం కొనసాగించాలని సూచించింది. తదుపరి విచారణను ఈనెల 26కి వాయిదా వేసింది.