-
-
Home » Andhra Pradesh » ap high court
-
కంపా నిధుల వినియోగంపై హైకోర్టులో విచారణ
ABN , First Publish Date - 2020-11-27T22:51:46+05:30 IST
అటవీశాఖలో కంపా నిధుల వినియోగంపై హైకోర్టులో విచారణ జరిగింది. అధికారులు 4 వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయకపోతే కోర్టుకు హాజరుకావాలని న్యాయస్థానం ఆదేశించింది. కేంద్రం ఇచ్చిన కంపా నిధులను

అమరావతి: అటవీశాఖలో కంపా నిధుల వినియోగంపై హైకోర్టులో విచారణ జరిగింది. అధికారులు 4 వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయకపోతే కోర్టుకు హాజరుకావాలని న్యాయస్థానం ఆదేశించింది. కేంద్రం ఇచ్చిన కంపా నిధులను సక్రమంగా వినియోగించలేదని పిల్ దాఖలైంది. సామాజిక కార్యకర్త తోట సురేష్ బాబు ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. పిటిషనర్ తరపున న్యాయవాది నర్రా శ్రీనివాస్ వాదనలు వినిపించారు. కంపా నిధులను రాష్ట్ర ప్రభుత్వం వినియోగించడంపై నివేదిక ఇవ్వాలని..అడిషనల్ సొలిసిటర్ జనరల్‌కు ధర్మాసనం ఆదేశించింది. ప్రతివాదుల కౌంటర్ దాఖలుకు 4 వారాలు హైకోర్టు గడువు ఇచ్చింది.