విశాఖలోని గ్రేహౌండ్స్ స్థలంలో గెస్ట్‌హౌస్‌ నిర్మాణం చట్ట విరుద్ధమంటూ..

ABN , First Publish Date - 2020-11-21T20:56:02+05:30 IST

విశాఖలోని గ్రేహౌండ్స్ స్థలంలో గెస్ట్‌హౌస్‌ నిర్మాణం చట్ట విరుద్ధమంటూ..

విశాఖలోని గ్రేహౌండ్స్ స్థలంలో గెస్ట్‌హౌస్‌ నిర్మాణం చట్ట విరుద్ధమంటూ..

అమరావతి: విశాఖలోని గ్రేహౌండ్స్ స్థలంలో గెస్ట్‌హౌస్‌ నిర్మాణం చట్ట విరుద్ధమంటూ అమరావతి జేఏసీ నేత గద్దె తిరుపతిరావు హైకోర్టులో పిల్‌ వేశారు. తిరుపతిరావు తరపున సీనియర్ న్యాయవాది ఉన్నం మురళీధర్ పిల్ వేశారు. గెస్ట్‌హౌస్‌కు సంబంధించిన బడ్జెట్, ప్లాన్ వివరాలు ఇవ్వాలని హైకోర్టు అడిగినా నేటి వరకు ప్రభుత్వం ఇవ్వలేదని పిటిషనర్‌ పేర్కొన్నారు. గ్రేహౌండ్స్ భూమిలో ఇప్పటికే రూ.వెయ్యి కోట్లకుపైగా ఖర్చు చేశారు..అక్కడ గెస్ట్‌హౌస్ నిర్మిస్తే ఖజానాకు నష్టమని ఉన్నం మురళీధర్‌ తెలిపారు. స్వామిజీ సూచించిన స్థలాల్లో గెస్ట్‌హౌస్ నిర్మాణం కోసం నిర్ణయం తీసుకోవడం సందేహాలకు తావిస్తోందని న్యాయవాది మురళీధర్‌ పేర్కొన్నారు.

Read more